ప్రభుత్వం మొద్దునిద్ర వదిలి రోడ్లు వేయాలి: జనసేన

పెనుకొండ నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు.. శనివారం సోమందేపల్లి జనసేన పార్టీ ఆద్వర్యంలొ #GoodMorningCMSir కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో బాగంగా నాయకులు మాట్లాడుతూ అనంతపురం నుండి హిందూపూర్ ప్రధాన రహదారిలో రోడ్లన్నీ గుంతల మాయమై పోయాయి. వర్షాకాలం ఐతే మరి దారుణంగా తయారు అవుతాయి.. ఇక్కడ చాలా ప్రమాదాలు కూడా తరుచూ జరుగుతుంటాయి.. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వదిలి రోడ్లు వేయాలని పెనుకొండ నియోజకవర్గం, సోమందేపల్లి మండలంలో జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జబిఉల్లా షేక్ ఉపాధ్యక్షులు కొల్లప్ప, ప్రధాకార్యదర్శులు నడింపల్లి మూర్తి, నాగార్జున, ఖాసీం కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి, మారుతి, రహమాన్, రామకృష్ణ, రవి సురేష్ రెడ్డి, అరుణ్, చల్లపల్లి సురేష్ వీర మహిళ శిరీష కార్యకర్తలు నాగరాజు, మున్న పాల్గొన్నారు.