ఘనంగా పిల్లిపోగు పీటర్ బాబు జన్మదిన వేడుకలు

ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గం, పొన్నలూరు మండలంలో జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో పొన్నలూరు జనసేన పార్టీ ఐటి అధ్యక్షులు పిల్లిపోగు పీటర్ బాబు జన్మదినం సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. పీటర్ బాబు ఒకపక్క సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ, మరోపక్క పార్టీ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటూ పార్టీకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు, కరోనా సమయంలో మండలంలో ఎంతో మంది నిరుపేదలకు నిత్యవసర సరుకులు, శానిటైజర్లు, బ్లౌజులు, వాటర్ బాటిల్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది, అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి పెద్దవెంకన్నపాలెం గ్రామానికి ప్రధాన రహదారి వేయడానికి ముఖ్య కారణం అయ్యి, జిల్లాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని పిల్లిపోగు పీటర్ బాబు సంపాదించుకున్నాడు అని కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు. పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడడమే నా అంతిమ లక్ష్యం, అదేవిధంగా నా సొంత గ్రామం అయినా పెద్దవెంకన్నపాలెం గ్రామానికి ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తానని పిల్లిపోగు పీటర్ బాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కనపర్తి మనోజ్ కుమార్, ఐయినాబత్తిన రాజేష్ (సింగరాయకొండ), కాసుల శ్రీనివాస్, పెయ్యల రవి, కుర్ర శ్రీకాంత్ యాదవ్, సుబ్రహ్మణ్యం నాయుడు, మహబూబ్ బాషా, తిరుమలరెడ్డి, భాషా, శ్రీను, సాయి, ప్రసాద్, భార్గవ్ మొదలైన వాళ్ళు పాల్గొన్నారు.