ఘనంగా జనసేన నూతన కార్యాలయ ప్రారంభోత్సవం

గన్నవరం నియోజకవర్గం: విజయవాడ రూరల్ మండల అధ్యక్షులు పొదిలి దుర్గారావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ రూరల్ మండల నూతన కార్యాలయాన్ని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి & తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు చేతుల మీదగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ గన్నవరం ఇన్చార్జి యార్లగడ్డ వెంకట్రావు, గన్నవరం నియోజకవర్గం సమన్వయకర్త చలమలశెట్టి రమేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాయపాటి అరుణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీమతి పోతిరెడ్డి అనిత, విజయవాడ నగర ఉపాధ్యక్షులు కామాల్ల సోమనాదం, నాయకులు రత్నం నాగేశ్వరరావు, కోలా సతీష్ మరియు జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా నాయకులు, గన్నవరం నియోజకవర్గ విజయవాడ రూరల్ మండల కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, జనసైనికులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.