భూపాలపల్లిలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

భూపాలపల్లి నియోజకవర్గం: భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలోని, సీనీహీరో మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను అమృత వర్షిణి అక్షర స్వచ్చంద సంస్థలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఆశ్రమంలోని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా వృద్ధులకు అన్నదానం మరియు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమనికి కొడిమల రాజు, బిరెల్లి సుమన్, అధ్యక్షత వహించగా ముఖ్యఅతిధిగా విచ్చేసిన జేరిపోతుల సనత్ కుమార్ హాజరై మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ప్రజరాజకీయ జీవితంలో ముందుకు కొనసాగి పేద ప్రజల కోసం పనిచేయాలని ఆకాంక్షిచారు. అదే విధంగా తెలంగాణ లోని జనసేన పార్టీ అందరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పవన్, వంశీ పైడిమల్ల రాజు, సోమిడి సురేష్ తదితరులు పాల్గొన్నారు.