దామలచెరువులో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

  • పవన్ కళ్యాణ్ గారి నినాదాలతో దద్దరిల్లిన చిత్తూరు జిల్లా పాకాల మండలం దామలచెరువు

చంద్రగిరి నియోజకవర్గం: దామల చెరువు హై స్కూల్ గేట్ వద్ద పాకాల మండల ఉపాధ్యక్షులు దినేష్ రాయల్ మరియు చరణ్ రాయల్ ఆధ్వర్యంలో శనివారం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అంగరంగవైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ కార్యదర్శిలు ప్రసాద్, నాశిర్, ఇరాల మండల కార్యదర్శి వాసు రాయల్, పాకాల మండల అధ్యక్షులు గురునాథ్, ఉపాధ్యక్షులు రహంతుళ్ళ, నౌమున్, షాజహాన్, హేమకుమార్, విజయ్, కిషోర్, బాలాజీ, దివాకర్, మహేష్ మరియు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, జనసైనికులు భారీ ఎత్తున పాల్గొన్నారు.