తాడిపత్రిలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

తాడిపత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా తాడిపత్రి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మొదటగా శ్రీకాంత్ రెడ్డి యాడికి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో కేక్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో దాదాపుగా 50 మంది జనసైనికులు రక్తదానం చేశారు. మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి భవన నిర్మాణ కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేయడం జరిగింది. ఈ సందర్బంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని అందులో భాగంగా నియోజకవర్గంలోని యాడికి మండల కేంద్రంలో రక్తదాన శిబిరం, తరువాత తాడిపత్రి పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలోని పారిశుద్ధ కార్మికులకు చేతి గ్లౌజులు, మాస్కులు అందజేయడం జరిగిందని అదేవిధంగా తాడిపత్రి మడలంలోని ఆవులతిప్పాయపల్లె గ్రామంలో ఉన్నటువంటి జీవనాలయంలోని దివ్యాంగులకు నీటి కొరత తీర్చడం కోసం ఆర్థిక సహాయంతో పాటు పెద్దపప్పురు మండల కేంద్రంలో ఉన్న బీసీ సంక్షేమ హాస్టల్ ను సందర్శించి అక్కడి వసతులు పరిశీలించి విద్యార్థుల కోసం స్టడీ అవర్స్ విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, పట్టణ నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.