ఘనంగా నాదెండ్ల జన్మదినోత్సవ వేడుకలు

తెనాలి నియోజకవర్గం: జనసేన, టీడీపీ, బీజేపీకూటమి అభ్యర్థి పూర్వపు అసెంబ్లీ స్పీకర్ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ జన్మదినోత్సవ వేడుకలు తెనాలి నియోజకవర్గ కార్యాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, జనసేన రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్, జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివధత్త, శ్రీకాకుళం జిల్లా నాయకులు, ప్రోటో్కాల్ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ గర్భాన సత్తిబాబు, అధిక సంఖ్యలో తూర్పుకాపు సంఘ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.