సయ్యద్ జిలాని ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

నరసరావుపేట నియోజకవర్గ జనసేన కార్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నరసరావుపేట ఇంచార్జ్ సయ్యద్ జిలాని ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన భారత దేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించడం కోసం ఎందరో మహానుభావులు ఆత్మబలి దానాలు చేశారు, ఎన్నో త్యాగాలు చేశారు, అలాంటి ఎంతోమంది మహానుభావుల త్యాగ ఫలితమే నేటి స్వతంత్రం.. భారత రాజ్యాంగం ప్రకారం చట్టాలు అమలైన పర్వదినం సందర్భంగా జనసేన పార్టీ తరపున నరసరావుపేట. నియోజకవర్గ ప్రజలకు 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. ఈ సందర్భంగా నరసరావుపేట నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు అద్దేపల్లి ఆనంద్, బెల్లంకొండ ఈశ్వర్, అచ్చుల సాంబశివరావు, కృష్ణం శెట్టి గోవింద్, అద్రుఫ్, గుప్తా శ్రీకాంత్, తిరుమల శెట్టి శ్రీను, అలా శ్రీను, ధమలం కొండలు, మిరియాల సోము, నారదాసు సంజీవరావు, రామారావు, రామకృష్ణ, వీర మహిళలు దుర్గా కుమారి, మిరియాల వెంకటసుబ్బమ్మ, దాసరి శివ, లీల, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.