బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాలంటీర్స్ కు ఘన సన్మానం

*జనసేన పార్టీ, కార్యకర్తల భీమారక్షణ కోసం క్రియాశీల సభ్యత్వాలు చేయించిన వాలంటీర్స్ కు ఘన సన్మానం చేసిన జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ !

కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ రథసారథి, జనసేనానికి ముఖ్య ఆత్మీయుడిగా.. కొత్తపేట నియోజకవర్గంలో జనసేన పార్టీని ఎంతో బలోపేతం చేసుకుంటూ గెలుపే లక్ష్యంగా.. అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ.. రేపటి రాబోయే ఎలక్షన్ కు.. ఈ రాష్ట్ర భవిష్యత్తుకు.. స్వార్ధం లేని నిజాయితీ పరుడైన జనసేనానికి అండగా.. కొత్తపేట నియోజక వర్గం గడ్డపై జనసేన జెండాను కచ్చితంగా ఎగర వేసేది ప్రముఖ జనసేన నేత కొత్తపేట నియోజక వర్గ ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్ అని పలు గ్రామాలలోని పలువురు ప్రజలు కోరుకుంటూ ఉన్నారని.. ఈ సందర్భంగా తెలియజేస్తూ.. జనసేన పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి క్రియాశీల సభ్యత్వలతోపాటు, 5 లక్షల రూపాయలు ప్రమాద భీమాను, ఇన్సూరెన్స్ పథకంను జనసేనాని పవన్ కళ్యాణ్ వారు ప్రవేశ పెట్టడం ఎంతో హర్షనీయమని, వారు అధికారంలో లేకపోయినా, ఎలాంటి స్వార్థం లేని మంచి మనసుతో, దేశంలో ఏ నాయకులు చేయలేని విధంగా, ఒక ఆంధ్ర రాష్ట్రంలో జనసేనాని తలపెట్టిన ఈ మహాయజ్ఞంను, క్రియాశీలక సభ్యత్వం నమోదు వాలంటీర్గా కొత్తపేట నియోజకవర్గంలోని 57 గ్రామాలలో నిరాటంకంగా జైత్రయాత్రతో క్రియాశీల సభ్యత్వాల ద్వారా ప్రమాద బీమా ఇన్సూరెన్స్ పథకం కిట్టలు జన సైనికులకు వర్తించే విధంగా ప్రతి ఒక్కరికి తెలియజేసిన వాలంటీర్స్ కు, జనసేనాని కోరికమేరకు, ఈ మూడు రోజులు, 10,11,12 తారీకులలో పలువు గ్రామాలలో వాలంటీర్స్ ను అభినందించడం.. వారిని ఘనంగా సత్కరించడం జరుగుచున్నదని తెలియజేస్తూ.. శుక్రవారం ఆత్రేయపురం మండలం, ఆత్రేయపురం గ్రామంలోని బండారు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, ఆత్రేయపురం మండలం జనసేన అధ్యక్షులు సీనియర్ ప్రముఖ నాయకులు చేకూరి కృష్ణంరాజు ఆధ్వర్యంలో, ప్రముఖ జనసేన నాయకులు తులా రాజు, మహా దశ బాబులు,ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శులు, తాళ్ల డేవిడ్ రాజ్ సీనియర్ (ప్రధాన కార్యదర్శి), బొక్క ఆదినారాయణ (జిల్లా బీసీ జనసేన యువ కార్యదర్శి), దొంగ సుబ్బారావు (జిల్లా బిసి యువ జనసేన కార్యదర్శి), సంగీత సుభాష్ యువ నేత పినపళ్ల గ్రామ ప్రస్తుత సర్పంచ్ జిల్లా జనసేన కార్యదర్శి, మరియు మండల కార్యదర్శులు, రావులపాలెం మండల అధ్యక్షుడు తోట స్వామి, ఆలమూరు మండలం జనసేన అధ్యక్షులు సూరపు రెడ్డి సత్య, తోట భవాని వెంకటేశ్వర్లు సందిపూడి గ్రామ మహిళా యువ సర్పంచ్, లoకే వరప్రసాద్ మూలస్థానం యువ దళిత జనసేన సర్పంచ్ విద్యావంతుడు, మూలస్థానం యువనేత సీనియర్ నాయకుడు సలాది జయప్రకాష్ నారాయణ ( జెపి), కొత్తపళ్లి నగేష్, కట్టా రాజు, వనచర ధనరాజు, దేశభక్తుల సత్యనారాయణ, నాగిరెడ్డి మహేష్, బైరిశెట్టి రాంబాబు మీడియా ప్రతినిధి, మరియు ఆత్రేయపురం మండల గ్రామ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలతో పాటు అధిక సంఖ్యలో పలువురు ప్రముఖ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు, వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.