లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్‌ మంజూరు

పశుగ్రాసం కుంభకోణంలో శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాణా కుంభకోణానికి సంబంధించిన ఓ కేసులో జార్ఖండ్ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. అయితే, డుమ్కా ట్రెజరీ కేసు విచారణలో ఉన్నందున ఆయన జైలు నుంచి బయటికి రావడం కుదరదు. ఇంకా జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పటికే చైబాసా ఖజానా అవినీతి కేసులో లాలూ ఇప్పటికే సగం శిక్షను అనుభవించేశారు.

శిక్ష సగం అనుభవించిన తర్వాత బెయిల్ రావడం విశేషం. సగం శిక్ష పూర్తైన తర్వాత లాలూ బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే… సగం శిక్ష పూర్తి కావడానికి ఇంకా 26 రోజులు మిగిలి ఉన్నాయని సీబీఐ కోర్టుకు నివేదించింది. దీంతో అక్టోబర్ 9 కి ఈ కేసు వాయిదా పడింది. శుక్రవారం మాత్రం ఈ కేసులో లాలూకు బెయిల్ లభించింది.