రాఘవపురం గ్రామంలో జన జాగృతి యాత్రకు విశేష స్పందన

  • దళితవాడలో రెపరెపలాడిన జనసేన జెండా
  • ఇంచార్జి మేడా గురుదత్తకు జనసైనికుల బ్రహ్మరధం

రాజానగరం, కోరుకొండ మండలం రాఘవపురం గ్రామంలో బుధవారం రాత్రి నిర్వహించిన 23 వ రోజు జన జాగృతి యాత్రకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి రాజానగరం నియోజకవర్గం జనసేన ఇంచార్జి మేడా గురుదత్త ప్రసాద్ ముఖ్య అతిదిగా హాజరైయ్యారు. ముందుగా గ్రామంలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి పూలమాలతో సత్కరించారు జనసైనికులు బైక్ ర్యాలీ నిర్వహించి గురుదత్తకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూప దేవికి ఘనంగా స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున జనసైనికులు ఉత్సహంతో హాజరైయి ఆయన నాయకత్వం బలపరుస్తూ బ్రహ్మరధం పట్టారు. ఈ సందర్భంగా ఆగ్రామానికి చెందిన జనసేన పార్టీ ప్రెసిడెంట్ నూకతట్టి శివ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో నియోజకవర్గ ఇన్చార్జ్ గురుదత్త ప్రసాద్ మాట్లాడుతూ… ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమయిందని విమర్శించారు. జనసేనాని పవన్ నిజాయితీ కలిగిన నాయకుడని అన్నారు. జనసేన ఆదరణ చూసి వైస్సార్సీపీ విశాఖపట్నంలో అక్కసు వెళ్ళగక్కారని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి లేదని విమర్శించారు. సేవభావం ఉన్న పవన్ కి ఓటేసి ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నిస్వార్ధపరుడు పవన్ అని తెలిపారు. నిస్వార్ధ సేవలు అందిస్తున్నారని ఆయనకు ప్రతి ఒక్కరూ అండగా నిలిచి రానున్న రోజుల్లో జనసేన జెండా ఎగరేసే విధంగా విజయాన్ని చేకూర్చాలని కోరారు. జనసేనపార్టీ జిల్లా కార్యదర్శి మైరెడ్డి గంగాధర్ మాట్లాడుతూ నిజాయితీ సేవాభావం కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఆయన నాయకత్వం బలపర్చి అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల జనసేన పార్టీ కన్వీనర్ మండపాక శ్రీను రాజానగరం మండలం పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, జనసేన నాయకులు ముక్కా రాంబాబు, అడపా అంజి, తన్నీరు తాతాజీ, చదువు ముక్తేశ్వరరావు, అరుబోలు బాలు, గల్లా సతీష్, దేవన కృష్ణా, తెలగంశెట్టి శివ, పోసిబాబు, సతీష్ వందలాదిగా గ్రామస్తులు, పెద్ద సంఖ్యలో జనసైనికులు చిన్నం శివ కొత్తపల్లి దాసు, కొర్రాయి రవి, అంబటి రామకృష్ణ, పీతల పండు, పూలపర్తి వీర్రాజు, గుండెల శ్రీను, కొనే రామకృష్ణ, నరసింహ, చక్రవర్తి, కొవ్వూరు సతీష్, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు. జనసేన పార్టీ గాజు గ్లాస్ ను గ్రామస్తులకు అందించారు.