వాడెవడన్నా వీడెవడన్నా బాబు రెడ్డికి అడ్డెవడన్న చందంగా మారిన కొట్టార్వేడు పంచాయతీ

*చెట్లను నరికే అధికారమెవరిచ్చారు?
*అటవీ చట్టం ప్రకారం జరిమానా, నష్ట పరిహారం, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి
*పర్యావరణ పరిరక్షణ భాద్యత ప్రతి ఒక్కరిది
*సంఘవిద్రోహాన్ని జనసేన సహించదు
*జనసేన ఇంచార్జి డా.యుగంధర్

కార్వేటినగరం మండలం, కొట్టార్వేడు గ్రామపంచాయతీ, కొట్టార్వేడు గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో మూడు టేకు చెట్లు, రెండు కానుగ చెట్లు, ఎనిమిది తైలం చెట్లను వీఆర్వో బాబు రెడ్డి నరికి నేలమట్టం చేసి, వాటిని తన ఇంటికి తీసుకు పోవడాన్ని జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న తీవ్రంగా ఖండించారు. వాడెవడన్నా వీడెవడన్నా బాబు రెడ్డికి అడ్డెవడన్న అన్న చందంగా పంచాయతీ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్లను నరికే అధికారం ఎవరిచ్చారు? అటవీ చట్టం ప్రకారం బాబు రెడ్డికి జరిమానా, నష్ట పరిహారం, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మండల విద్యాధికారి ని కలిసి వినతిపత్రం సమర్పించి, డిమాండ్ చేశారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యత బాబురెడ్డికి లేదా? పంచాయతీ సిబ్బందికి లేదా? నిరుపేదలు చదువుతున్న బడిలో పర్యావరణాన్ని ప్రోత్సహించి పిల్లల ఆరోగ్యానికి, వారి అభివృద్ధికి పాటు పడాల్సిన అధికారి అభివృద్ధి నిరోధకంగా మారడం హాస్యాస్పదం, అమానుషం, హేయమైన చర్య అని ఎద్దేవా చేశారు. బాబు రెడ్డి తన ఇంటి వద్ద ఉన్న దుంగలను పాఠశాలకు సమర్పించా లని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ సిద్ధాంతాల్లో పర్యావరణాన్ని పరిరక్షించే విధానం ముఖ్యమైనది అని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిదని ఈ సందర్భంగా తెలిపారు. సంఘవిద్రోహ చర్యలను జనసేన పార్టీ సహించదు, ఎక్కడ అభివృద్ధి నిరోధకం ఉంటుందో అక్కడ జనసేన ఉద్భవిస్తుంది, ఎక్కడ ప్రజలు కష్టాల్లో ఉంటారో, అక్కడ జనసేన ఉంటుంది, ఎక్కడ నిరుపేదలకు అన్యాయం జరుగుతుందో అక్కడికి జనసేన వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శోభన్ బాబు, ప్రధాన కార్యదర్శి నరేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవేంద్ర, ఉపాధ్యక్షులు విజయ్ ఉన్నారు.