గ్రేటర్ రిజల్స్: మరికాసేపట్లో కౌంటింగ్

గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ మరికాసేపట్లో మొదలు కాబోతుంది. కౌంటింగ్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు ఒకొక్కరుగా సిబ్బంది చేరుకుంటున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సిబ్బంది హాల్స్ లోకి వెళ్తున్నారు. సికింద్రాబాద్ ఏవీ కాలేజ్‌లో ముషీరాబాద్ సర్కిల్ డివిజన్ల ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఎల్బీ నగర్ సర్కిల్-4 పరిధిలోని నాలుగు డివిజన్లు 15వ వార్డు-వనస్థలిపురం 16వ వార్డు-హస్తినాపురం, 17వ వార్డు-చంపాపేట, 18వ వార్డు-లింగోజిగూడ డివిజన్‌లకు సంబంధించిన ఓట్లను సరూర్ నగర్ వీఎం హోమ్‌లో లెక్కింపు జరుగనుంది. అదేవిధంగా సరూర్ నగర్ సరూర్ నగర్ సర్కిల్ పరిధిలోని ఐదు డివిజన్లకు కౌంటింగ్ జరుగనుంది. 19వ వార్డు- సరూర్ నగర్ డివిజన్, 20వ వార్డు-ఆర్.కె.పురం డివిజన్ , 21వ వార్డు-కొత్తపేట డివిజన్, 22వ వార్డు – చైతన్యపురి డివిజన్, 23వ వార్డు – గడ్డిఅన్నారం డివిజన్‌లకు సంబంధించిన ఓట్లను సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో లెక్కించనున్నారు.