ఉగాది పర్వదినం సందర్భంగా చలివేంద్రం ఏర్పాటు చేసిన గుడివాడ పట్టణ జనసైనికులు

కృష్ణాజిల్లా, గుడివాడ పట్టణం, స్థానిక బస్టాండ్ సెంటర్లో జనసైనికులు ఆధ్వర్యంలో శ్రీమతి డొక్కా సీతమ్మ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (ఆర్.కె) మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శ్రీమతి డొక్కా సీతమ్మ స్పూర్తితో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందినీ గ్రహించి ఉచిత మంచినీరు అందజేయడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా ఉగాది పర్వదిన సందర్భంగా ప్రజలకు మజ్జిగ అందిచడం జరిగిందని తెలియజేశారు. సేవే మార్గం ప్రేమే లక్ష్యం అనే నినాదంతో ప్రజలకు దగ్గరగా ఉంటూ జనసేన పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆర్గానిక్ ప్రసాద్, సందు పవన్, పేర్ని జగన్, మెకానిక్ మూర్తి, అయ్యప్ప, జగదీష్, చరణ్, సతీష్, కార్తీక్, శ్యాము మరియు జనసైనికులు పాల్గొన్నారు.