అగ్నిప్రమాద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన లలితాదేవి చారిటబుల్ ట్రస్టు

అవనిగడ్డ, సోమవారం రాత్రి వసుమట్ల కాలనీలో జరిగిన అగ్నిప్రమాదం గురించి తెలుసుకుని లలితాదేవి చారిటబుల్ ట్రస్టు తరపున ట్రస్టీ అయిన ముమ్మారెడ్డి కృష్ణారావు బాధితుల కుటుంబాలకు వంట సామాగ్రి, దుప్పట్లు, చీరలు, నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం అందచేశారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు, ఎంపీటీసీ బొప్పన భాను, పులిగడ్డ గ్రామ పార్టీ అధ్యక్షులు మండలి ఉదయ్, వార్డు సభ్యులు అడపా ప్రభాకర్, కమ్మిలి సాయి భార్గవ, కమతం నరేష్ తదితరులు పాల్గొన్నారు.