అభిరుదికి నోచుకోని గుంతకల్లు నియోజకవర్గం

  • గుంతకల్లులో డ్రైనేజీ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు
  • గుంతకల్లులో డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలి.. జనసేన వినతిపత్రం

గుంతకల్లు నియోజకవర్గం: గుంతకల్లు మున్సిపాలిటీ 6వ వార్డు పరిధిలోని జగ్జీవన్ రామ్ కాలనీ నందు గత 3 నెలలుగా డ్రైనేజీ నీరు నిలువ మరియు వాటి ద్వారా వస్తున్న మురికి వాసన సమస్యతో అక్కడ నివాసముంటున్న ప్రజలు డెంగ్యూ, మలేరియా మరియు ఇతర రోగాల బారిన పడుతున్నారు. ఆ రోడ్ మార్గంలో ప్రయాణిస్తున్న చిన్న పిల్లలు, స్త్రీలు, విద్యార్థులు, వయసు పైబడిన వారు మరియు స్థానికి నివాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ ను కోరడం జరిగింది. ఈ సంధర్బంగా జనసేన పార్టీ నాయకులు అరికేరీ జీవన్ కుమార్ మాట్లాడుతూ.. 3 నెలలుగా డ్రైనేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రభుత్వము ఎలాటి చర్యలు తీసుకోవటం లేదు. ఏనికల సమయంలో ఒక అవకాశం అని చెప్పి గెలిచి ఇపుడు ఈ డ్రైనేజీ సమస్య పరిష్కరించమని అడిగితే ఈ రోజు చేస్తాం, రేపు చేస్తాం అని గత మూడు నెలలుగా దొంగలులా పారిపోతున్నారు. ప్రభుత్వం వెంటనే డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాము లేనియెడల జనసేన పార్టీ రోడ్లు పైకి వచ్చి పోరాడుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు అరికేరి జీవన్ కుమార్, అనంతపురం జిల్లా కర్యనిర్వహన కమిటీ సభ్యులు అమీర్ సొహైల్, మారుతీ కుమార్ యాదవ్, ఆర్ సీ సురేష్, తాడిపత్రి మహేష్ కుమార్, జీలన్ బాషా తదితరుల పాల్గొన్నారు.