రోడ్ల దుస్థితిపై సర్కారును నిలదీసిన ఉమ్మడి పార్టీ నాయకులు

  • పేరుకే వైఎస్సార్ కాలనీ ఏ మాత్రం మౌలిక సదుపాయాలకు నోచుకోని స్థానిక ప్రజలు
  • కాలనీ ప్రధాన మార్గం మొత్తం గుంతలమయం వర్షాలు పడితే చెరువులను తలపించే వైనం
  • 15000 కుటుంబాలకు పైగా తిరిగే మార్గాన్ని నల్గున్నర ఏళ్లుగా పట్టించుకోకపోవటంపై మండిపడ్డ దొమ్మలపాటి
  • హెల్లొ ఏపీ బై – బై వైసీపీ నినాదంతో మార్మోగిన మార్మోగిన వైఎస్సార్ కాలనీ

మదనపల్లి నియోజకవర్గం: మదనపల్లి మండలం కోళ్లబైలు పంచాయతీ వైఎస్ఆర్ కాలనీ నందు తెలుగుదేశం – జనసేన ఉమ్మడి పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమంలో మదనపల్లి మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇంచార్జి దొమ్మాలపాటి రమేష్ మాట్లాడుతూ వైఎస్సార్ కాలనీ ప్రజలు ప్రతి రోజు తిరిగే ప్రధాన రోడ్డు మార్గం దుస్తిని నాలుగున్నర సంవత్సారాలుగా ప్రభుత్వం పట్టించుకోకపోవటం పట్ల మండిపడుతూ ప్రజా సమస్యల పట్టించుకోకుండా పరిపాలన సాగిస్తున్నారని స్థానిక ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం చేతకాలేదు అని అలాగే వర్షాలు పడితే ఆ రోడ్డు చెరువులను తలపించేల మారుతుందని ప్రజలు ఇబ్బందులకు గురౌతున్నారు తెలియచేశారు. జనసేన నాయకులు రామాంజులు, దారం అనిత మాట్లాడుతూ ప్రజా సమస్యలు పట్టించుకోకపోవటంపై మండిపాటు వ్యక్తం చేస్తూ రానున్న ఎన్నికల్లో ప్రజలే ఈ చేతకాని ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని జనసేన – టీడీపీ ఉమ్మడి కూటమి ప్రజా శ్రేయస్సు కోసం ఒక్కటై కలసి వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సగణంపుతామని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామాంజులు, దారం అనితమదనపల్లి నియోజకవర్గ యువ నాయకులు దొమ్మలపటి యశశ్వి రాజ్, దొమ్మలపాటి చాణక్య తేజ్, ఆర్జే వెంకటేష్, ఎస్.ఎం రఫీ, కత్తి లక్ష్మన్న, దారం హరిప్రసాద్, కత్తి అరుణ్, రఘునాథ్ నాయుడు, మోహన, వినోద్, సాకే కృష్ణమూర్తి, రామాంజనేయులు, సిద్దప్ప, నీలకంఠ, వేల్పుల వెంకటేష్, దాధు, నిస్సార్, ప్రభాకర్, మల్లికార్జున నాయుడు, బావజాన్, శివ కృష్ణ, సికిందర్, దుర్గాప్రసాద్, సోమశేఖర్, ధరణి, గోపాల్ కృష్ణ, మల్లిక, రూప, కిరణ్, రాజు, కే.శంకర, కే.చంద్రశేఖర్, అశ్వత్, హర్ష, సోను, యాసిన్, గణేష్, శివ, శంకర, శ్రీనాథ్ మరియు తెలుగుదేశం, జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.