యువశక్తి పోస్టర్ ను ఆవిష్కరించిన గుంటురు జనసేన

  • యువత భవితవ్యంతో ఆడుకుంటున్న సిఎం జగన్

గుంటురు, యువతకు అసత్య హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన సిఎం జగన్ రెడ్డి నిరుద్యోగులను నయవంచన చేస్తున్నారని జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు నేరెళ్ళ సురేష్ ఆరోపించారు. శుక్రవారం జనసేన నగర సంయుక్త కార్యదర్శి కొత్తకోట ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక బ్రాడిపేట 32వ డివిజన్లో యువశక్తి పోస్టర్ ను ఆవిష్కరించి జనసేన యువశక్తి కార్యక్రమంపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నేరెళ్ళ మాట్లాడుతూ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ అరాచక పాలనలో సామాన్యులు బ్రతకలేని దయనీయ పరిస్తితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయని ఎద్దేవా చేశారు. ఈ నెల 12 వ తేదిన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో తమ అధినేత పవన్ కల్యాణ్ తలపెట్టిన యువశక్తి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకే ప్రభుత్వం జిఓ 1 విడుదల చేసిందని ఆరోపించారు. సి.ఎం జగన్ తమ కోటరీలోని నలుగురికీ తప్ప ఏ ఒక్కరికే న్యాయం చేయలేకపోయారని ఘాటుగా వ్యాఖ్యానించారు. యువతను మోసంచేసిన ఈ ముఖ్యమంత్రికి బుద్ది వచ్చేలా ప్రజలందరూ మరీ ముఖ్యంగా మహిళలు, యువత పెద్దఎత్తున హాజరయి యువశక్తి కాయక్రమాన్ని విజయవంతం చేయాలని జనసేన శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి కటకంశెట్టి విజయలక్ష్మి, పులిగడ్డ గోపి పుల్లంశెట్టి ఉదయ్, 32 డివిజన్ అధ్యక్షుడు చందు శీను వాసరావు, పాశం మధు, గడ్డం చిరంజీవి, గబ్బిళ్ళ సునీత, నల్లిబోయిన సునీత, యమ్ అనురాధ, కుంచం రమాదేవి, షేక్ నాగూర్ భాష, అరవింద్ జైన్, షేక్ రఫీ, బూడి రాంబాబు, రేజేటి శీనువాసరావు, పాశం ప్రసాదు, కొత్తకోటి పవన్ కళ్యాణ్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.