ప్రజా సమస్యలు పక్కదారి పట్టించి ప్రజలను ఏమార్చుతున్నారు

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు, జనసేనపార్టీ నిర్వహించబోయే ప్రతిష్టాత్మక యువశక్తి మన యువత మన భవిత కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఈ నెల 12 వతేదీన జరగబోతుంది. పాడేరు, అరకు నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్న జనసేనపార్టీ రాష్ట్ర నాయకులు తాతంశెట్టి నాగేంద్ర శుక్రవారం జనసేనపార్టీ కార్యాలయంలో అరకు, పాడేరు పార్లమెంట్ జనసేనపార్టీ ఇన్చార్జ్ డా.వంపూరు గంగులయ్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది వాళ్లేమో కుటుంబ సమేతంగా యాత్రలు, పాదయాత్రలు చేసుకోవచ్చు కానీ మేము ప్రజాచైతన్యం కోసం చేసే పాదయాత్రలకి, బస్ యాత్రలకు మాత్రం కాలం చెల్లిన బ్రిటిష్ చీకటి జీవోలు తీసుకొచ్చారు మా నాయకుడు సినిమా అంటే భయం మా నాయకుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడితే వైసీపీ నాయకులు మాత్రం వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ ప్రజా సమస్యలు పక్కదారి పట్టించి ప్రజలను ఏమార్చుతున్నారు ఇదేమి ప్రభుత్వం అంటూ ఎద్దేవా చేశారు. ఈ నెల 12వ తేదీన జరగబోయే యువశక్తి సభకు పాడేరు అరకు నియోజకవర్గాల నుంచి కూడా పాల్గొని రణస్థలంలో మీ శక్తి సామర్ధ్యాలను మీ వాని వినిపించాలని యువతకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గములో గల పలు మండలాల ముఖ్యనాయకులు వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు. పాడేరు మండల నాయకులు కమల్ హాసన్, అశోక్, సత్యనారాయణ, నాయుడు, సంతోష్, అశోక్ కిల్లో, జి.మాడుగుల నాయకులు మసాడి భీమన్న, ఈశ్వరరావు, మసాడి సింహాచలం, టివి రమణ, రాజు, చింతపల్లి మండల నాయకులు, బుజ్జి బాబు, దేపురు రాజు, రవి, పండు తదితర జనసైనికులు పాల్గొన్నారు.