నూతన కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గునుకుల కిషోర్

నెల్లూరు జిల్లాలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ శ్రీ ఎం హరి నారాయణన్ ఐఏఎస్ ని కలెక్టర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్. జిల్లాలో అక్రమ మైనింగ్, ఇసుక తవ్వకాలు, అక్రమ లే అవుట్ లతో పాటు అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. మీ దృష్టికి తీసుకొస్తామని తెలపడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారానికి తమ తోడ్పాటు కావాలని కోరారు. బదిలీ అయిన జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ప్రజల పట్ల ఎంతో బాధ్యత కలిగి ఉండే వారిని జిల్లాలో ఏ సమస్య దృష్టికి తీసుకువచ్చిన సంబంధిత అధికారులు విచారించి బాధితులకు తగు న్యాయం చేసే విధంగా ఉండే వారనీ, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా జిల్లాలో ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకు వస్తామని తమరు అందుబాటులో ఉండి తగి చర్యలు చేపట్టాలనీ తెలియజేశారు.