గాంధీ మహాత్మునికి నివాళులర్పించిన గునుకుల కిషోర్

నెల్లూరు: సత్యం, అహింస ఆయుధాలుగా స్వరాజ్యం సాధించిన బాపూజీ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరపున జనసేన నాయకులు గునుకుల కిషోర్ నెల్లూరు సిటీ జాతిపిత గాంధీజీ విగ్రహానికి మాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ రోజుల్లోనే సంవత్సరానికి 15 వేల డాలర్లు సంపాదించగల విలాసవంతమైన జీవితాన్ని వదలుకొని పేదలకు దగ్గరగా అతి సామాన్యమైన జీవితం గడిపి కులమతాలకతీతంగా ప్రజలను మేల్కొల్పిన బాపూజీ జీవన గమనం ప్రతి ఒక్కరికీ చిరస్మరణీయం. అదే మార్గంలో విలాసవంతమైన జీవితాన్ని వదిలి సామాన్యుల కోసం తన జీవితాన్ని అర్పిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇచ్చి ప్రజా ప్రభుత్వం స్థాపించేందుకు రాష్ట్ర ప్రజలు అవకాశం ఇవ్వాలి. నేడు కోవూరు నియోజకవర్గంలో కొత్త ఎల్లంటి లో చూస్తే స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చిన భూములను జగనన్న భూ సర్వే పేరుతో వెనక్కి లాక్కునే ప్రయత్నం చేస్తున్న ఈ జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. అర్దరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరిగగలిగినప్పుడే అసలైన స్వరాజ్యం అని చెప్పిన గాంధీజీ పొడుస్తూ నేడు నెల్లూరు తయారయింది. అన్నమయ్య సర్కిల్ ప్రాంతంలో చదువుకున్న యువకులు కనీసం రాత్రి 8 దాటిన తర్వాత తిరగలేకున్నారు. వరుసగా అక్కడ తాగుబోతులు దాడి చేసి వారిని గాయపరుస్తున్నారు. నగరం నెల్లూరు పరిధిలో క్రైమ్ పెరిగిపోయింది. శాంతిభద్రతలు కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గునుకుల కిషోర్, కాపు సంక్షేమ శాఖ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సుధా మాధవ్, వీరమహిళలు హైమావతి, రేణుక, జనసైనికులు ప్రశాంత్ గౌడ్, షాజహన్, వెంకీ, కేశవ్, శ్రీను, వర్షన్, వర తదితరులు పాల్గొన్నారు.