సీతానగరం మండలంలో గురుదత్ ప్రసాద్ సుడిగాలి పర్యటన..

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలంలో జనసేన పార్టీ రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ పర్యటించారు. పర్యటనలో భాగంగా ఇనుగంటివారిపేట గ్రామనికి చెందిన సీతానగరం మండల కమిటీ సభ్యులు కొండేటి సత్య గత కొన్ని రోజులుగా లెగ్ ప్యాక్చర్ కారణంగా బాధపడుతున్నారనే విషయం జనసేన పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న గురుదత్ ప్రసాద్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూప దేవి వారిని పరామర్శించి త్వరగా కోలుకుని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, సీతానగరం మండలం జనసేన పార్టీ కో -కన్వీనర్ కాత సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి దుబాయ్ శ్రీను, సీతానగరం మండల నాయకులు అప్పయమ్మ (ప్రసాద్ ), రాయపాటి ప్రసాద్, కోరుకొండ మండలం జనసేన పార్టీ నాయకులు చదువు ముక్తేశ్వరరావు, చదువు నాగేశ్వరరావు, ఇనుగంటివారిపేట జనసైనికులు పాల్గొన్నారు.