జనసేన ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ల పంపిణీ

పాలకొండ నియోజకవర్గం, భామిని మండలం, ఘనసర గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో 2023 నూతన సంవత్సర క్యాలెండర్ల పంపిణీ కార్యక్రమం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చేపట్టిన షణ్ముఖ వ్యూహం గురించి ప్రజలకి వివరించటం జరిగింది.. అప్పుల ఆంధ్రాని కాపాడే ఏకైక వ్యక్తి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి తోనే సాధ్యం అని తేలియజేయటం జరిగింది. జనసేన అధ్యక్షులు యువశక్తి కార్యక్రమంలో చేసిన తీర్మానం గురించి కుడా తేలియజేయటం జరిగింది. రాబోయే ఎన్నికల్లో ప్రజలు అందరూ ఏకమై రాష్ట్ర భవిష్యత్ కోసం జనసేన పార్టీకి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మడపాన అనిల్ కుమార్, యారబాటి వినోద్ కుమార్, బెహారా మోహన్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.