అక్రమ కేసులు, అఘాయిత్యాలను ఖండించిన గురజాల జనసేన

గురజాల, విశాఖపట్టణంలో పవన్ కళ్యాణ్ పర్యటన, జనవాణి కార్యక్రమాలను ఆపడానికి అధికారమదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీస్ శాఖ వారిని వాడుకొని, జనసేన నాయకులపై అక్రమ కేసులు పెట్టి, అరెస్టు చేసిన తీరుపై గురజాల జనసేన నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఆధ్రప్రదేశ్ లో జరిగే అఘాయిత్యాలు, రౌడీ రాజకీయాలకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ లో ప్రజాసౌమ్యాన్ని బ్రతికిద్దామని మద్దతుగా నిలిచిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులకు. గురజాల మున్సిపాలటీ (జనసేన పార్టీ) 18వ వార్డు కౌన్సిలర్ చింతకాయల కళ్యాణ్ హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు భీమా వెంకటేష్, కడియం వీరాస్వామి మరియు గురజాల ప్రసాద్ మండల కార్యదర్శి చౌకల వెంకట నారాయణ, మస్తాన్ ముత్యాలు, జనసైనికులు పాల్గొన్నారు.