పవన్ కళ్యాణ్ ను విమర్శించే స్థాయి హాఫిజ్ ఖాన్ కి లేదు: పవన్ కుమార్

కర్నూలు: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను విమర్శించే స్థాయి కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ కి లేదని, నీ స్థాయి తెలుసుకొని మాట్లాడు అని కర్నూలు జిల్లా జనసేన నాయకులు పవన్ కుమార్ అన్నారు. కర్నూలు నగరంలోని మంగళవారం జనసేన నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పవన్ కుమార్ మాట్లాడుతూ.. మీ పైన పోటీ చేయడానికి మా జనసైనికులు చాలని పవన్ కళ్యాణ్ గారు అక్కర్లేదన్నారు. ముందుగా మూడు రాజధానుల పేరుతో కర్నూలు నగరంలో రెండు సార్లు భారీ ర్యాలీలు పాలాభిషేకాలు చేసిన మీరు మూడు రాజధానులలో భాగంగా కర్నూలుకు న్యాయ రాజధాని ఎప్పుడు తీసుకొస్తున్నారో చెప్పాలన్నారు. అలాగే కర్నూలు నగరంలో చిన్నారి ప్రీతి బాయ్ కేసును అప్పజెప్పాం.. సిబిఐ నిందితులకు శిక్ష పడే విధంగా లోతుగా విచారణ చేస్తుందని చెప్పి ప్రెస్ మీట్స్ పెట్టి ప్రచారం చేయడం జరిగింది, మరి ఇప్పటి వరకు కూడా ఈ కేసులో నిందితులను ఎందుకు ప్రభుత్వం శిక్షించ లేదన్నారు.. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు.