‘పుష్ఫ’ షెడ్యూల్ టైమ్‌లో సగం మేకప్‌కే పోతుందట..!

అల్లు అర్జున్ – రష్మిక జంటగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. రంగస్థలం ఫేమ్ సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్ గా మామిడి పల్లి లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ, ప్రస్తుతం కేరళ లో షూటింగ్ జరుపుకుంటుంది.

పుష్ప’ కోసం బన్నీ మేకప్ వేసుకోవడానికి రోజుకు రెండు గంటలు సమయం పడితే.. దాన్ని తీయడానికి సుమారు గంటన్నర టైం పడుతున్నట్లు తెలుస్తోంది. నిజంగా ఒక లారీ క్లీనర్ గా కనిపించడానికి డైలీ మూడున్నర గంటల సమయం కేటాయిస్తున్నారన్నమాట. ఇందులో అల్లు అర్జున్ హెయిర్ – కనుబొమ్మలు – గడ్డం మీసాలతో సహా ప్రతి విషయం కూడా రోజువారీ కార్మికుడిని గుర్తు చేసే విధంగా ఉంటాయని తెలుస్తోంది.