ఫలించిన జనసేన దేవర మనోహర పోరాటం

  • చంద్రగిరి, పనబాకం రైతుల కళ్లలో ఆనందం
  • చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్ హెచ్ 140 వల్ల నష్టపోతున్న పనపాకం స్థానికులకు & రైతులకు న్యాయమైన నష్టపరిహారం అందించి వారికి పునరావాసం కల్పించాలని మరియు వారు పడుతున్న ఇబ్బందులను పలుధఫాలుగా అధికార యంత్రాంగంకు విన్నవించిన దేవర మనోహర

చంద్రగిరి: జులై 20, 2022న స్థానిక ఎన్ హెచ్ -140, నాయుడు పేట నుంచి చిత్తూర్ వైపు వెళ్తున్న ప్రధాన రహదారిలో పనపాకం పంచాయతీలోని ఇరివిశెట్టిపల్లె వాస్తవ్యులు దాదాపు 53 మందికి పైగా ఇండ్లు కట్టుకోవడానికి తీసుకున్న ప్లాట్స్ మరియు వివిధ రకాల అహరోర్త్పత్తులు పండించుకుంటున్న భూములు కోల్పోతున్నారని, వీరిలో కేవలం ముగ్గురికి మాత్రమే బలవంతగా అదికూడా నామమాత్ర మైన నష్ట పరిహారం చెల్లించారు మిగిలిన 50 మంది రైతులకి ఎటువంటి నష్ట పరిహారం చెల్లించలేదంటూ గత సంవత్సర కాలంగా నిరవధిక పోరాటం కనసాగిస్తూ. జనసేన ప్రజల పక్షాన నిలబడి బాధితులకి న్యాయం జరిగే విధంగా కింద కనపర్చిన డిమాండ్లు పరిశీలించి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం సమర్పించగా. ఎంతో సుదీర్ఘ పోరాటమనంతరం పేద ప్రజలకు మరియు అధికార యంత్రాంగం నడుమ సయోధ్య కుదిర్చి తన ప్రజలకోసం బాధ్యతతో మధ్యవర్తిత్వం చేసి ప్రభుత్వం సానుకూలంగా స్పందించేలా చెయ్యడంలో దేవర మనోహర చేసిన కృషి నేడు పెద్ద ప్రజల ముఖంలో చిరునవ్వు చిందిస్తుంది. చిత్తూరు జిల్లా కాలా(జేసీ) ఇచ్చిన హామీ మేరకు మొదట విడతగా రైతులకు రావలసిన బకాయిలను వారు సంతకాలు చేసిన రెండు రోజుల్లో వారి అకౌంట్లో నగదు జమ చేస్తామని, అలాగే ఆర్బిటేషన్ అమౌంటు దత్త చేసిన 15 రోజుల్లో వారి అకౌంట్లో జమ చేస్తామని, ఆ తరువాత మాత్రమే రైతుల పొలాలు మరియు ఇండ్లు మేము తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు శ్రీ దేవర మనోహర, మండల అధ్యక్షులు శ్రీ సంజీవి హరి, వాకా మురళి తదితరులు పాల్గొని రైతులకు అండగా నిలవడం జరిగింది. 1. ఎన్ హెచ్ ఏ ఐ వారు కేంద్ర భూసేకరణ చట్టం ప్రకారం ది రైట్ తో ఫెయిర్ చొంపెన్సతిఒన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ లాండ్ ఆసీక్విసాటిన్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ఆక్ట్, 2003 ప్రకారం నష్ట పరిహారాన్ని లెక్కించి నష్ట పరిహారం చెల్లించాలి. 2. ప్రభుత్వ అధికారులు నష్ట పోతున్న స్థానికుల ఇల్లు భూములను రీ-సర్వే చేసి ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రస్తుత మార్కెట్ ఆధారంగా నష్ట పరిహారం చెల్లించాలి. 3. ఇండ్లు కోల్పోతున్న బాధితులకు బిల్డింగ్ విలువ మరియు భూమి విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం అంచనా వేసి రీ-సర్వే చేసి న్యాయపరంగా చట్టం ప్రకారం నష్ట పరిహారం అందించాలి. 4. వ్యవసాయ సాగు భూములకు ఆ భూముల ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా రీ-సర్వే చేసి మరియు
ఆ భూములలో ఉన్న చెట్లు, పంటలు మరియు ఏ ఇతర అన్నింటిని కలిపి నష్ట పరిహారం చెల్లించాలి. 5. వీరందరికి తక్షణమే వాళ్ళు ఇంతకు మునుపులాగా జీవించే విధంగా రోడ్డుకి దగ్గర ఉన్న ప్రదేశాలలో అనువైన భూములలో వారికి పునరావాసం కల్పించాలి.