బక్రీద్ శుభాకాంక్షలు

ప్రేమ, దాతృత్వం, క్షమ, త్యాగనిరతిని సందేశంగా అందించింది దివ్య ఖురాన్. అటువంటి త్యాగ నిరతికి ప్రతీకగా జరుపుకొంటున్న బక్రీద్ పర్వదిన సందర్భంగా నా పక్షాన, జనసేన పక్షాన ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. సాటివారు, సమాజం, దేశం పట్ల త్యాగ బుద్ధితో మెలగాలన్నది బక్రీద్ తెలియచెబుతోంది. ఈ పర్వదినం అంతరార్థాన్ని అందరూ గ్రహించాలని జనసేనాని ఆకాంక్షించారు.