65వ వసంతంలోకి అడుగు పెట్టిన మెగాస్టార్ కు హాప్పీ బర్త్ డే

స్టార్స్ ఎన్ని ఉన్నా మెగాస్టార్ ఒక్కడే. తెలుగు సినిమా చరిత్రలో ఆయన ఒక శిఖరం తన కృషి పట్టుదలతో సామాన్యుడి నుండి మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి, ప్రేక్షకుల మనస్సులో గుడికట్టుకున్నారు. ఆయన ఎంట్రీతోనే థియేటర్లన్నీ మారుమోగాల్సిందే. అలాంటి మెగాస్టార్ చిరంజీవి జన్మదినం అంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక పండగే. ఈ రోజుతో (ఆగస్టు 22) మెగాస్టార్ 65వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్బంగా సోషల్ మీడియా వేదికగా.. ఆయన ఫ్యాన్స్, ప్రముఖులు ప్రత్యేకంగా డిజైన్ చేసిన పోస్టర్లను పంచుకుని మెగాస్టార్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.

మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ .. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారమే ఓ కామన్ డీపీని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఇది ఒక్కటే కాదు..  చిరు బర్త్ డే సందర్భంగా ఒకేసారి 100 మంది సినీ ప్రముఖులు, అభిమానులు కామన్ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అయితే రామ్ చరణ్ పంచుకున్న పోస్టర్‌లో.. చిరంజీవి కెరిర్‌లో అంచెలంచెలుగా ఎదిగిన విధానాన్ని చూపించారు. ఖైదీ, పసివాడి ప్రాణం, గ్యాంగ్ లీడర్, స్వయంకృషి, ఇంద్ర, ఖైదీనంబర్ 150 లాంటి చిత్రాల్లో ఉన్న పాత్రలను దీనిలో ఉంచారు. ఈ పోస్టర్ మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.