ఖేల్ రత్న విజేతలు

కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం క్రీడల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారికి ఇచ్చే అరుదైన ఖేల్ రత్న అవార్డుల్ని ప్రకటించింది. ఖేల్ రత్న అవార్డును వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభ కనబర్చిన ఐదుమందికి ఇస్తుంటారు. ఇందులో బాగంగా ఈ ఏడాది ఖేల్ రత్న అవార్డుల్ని వెల్లడించింది. ఈ ఏడాది ఖేల్ రత్న అవార్డు గ్రహీతల్లో క్రికెట్ రంగం నుంచి రోహిత్ శర్మ, పారా అథ్లెట్స్ నుంచి టి మరియప్పన్, టేబుల్ టెన్నిస్ రంగం నుంచి మణికా బాత్రా, రెజ్లింగ్ నుంచి వినేష్, హాకీ నుంచి రాణి ఉన్నారు.