హ్యాపీ బర్త్ డే మై లవ్…

కొత్త పెళ్లికూతురు నిహారిక పుట్టినరోజు ఈ రోజు. పెళ్లి తర్వాత నిహారిక సెలబ్రేట్ చేసుకుంటున్న ఫస్ట్ బర్త్ డే ఇది. ఈ సారి నిహారిక తన మెట్టినింట్లో ఈ బర్త్ డే జరుపుకోవడం స్పెషల్. ఈ సందర్భంగా నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డ తన భార్యకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసాడు. నీ రాకతో నా జీవితంలో కొత్త వెలుగులు ప్రసరించాయి. నిహారిక నా జీవితానికి సన్ ఫ్లవర్ అంటూ పొద్దుతిరుగుడు పూవుతో నిహారికను పోల్చాడు. సూర్య కాంతితోనే సన్ ఫ్లవర్‌ వికసిస్తోంది. అలాగే నిహారిక తన జీవితంలో అడుగుపెట్టడంతో నా జీవితం కూడా వికిసించిందని కవితాత్మకంగా వివరించాడు.

నిహారిక విషయానికొస్తే.. తెలుగు ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. మెగా కుటుంబం నుంచి హీరోలే కాదు హీరోయిన్లు కూడా వస్తారని చూపించింది ఈ ముద్దుగుమ్మ. వచ్చినా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే ఈమె సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. ఇదిలా ఉంటే డిసెంబర్ 18న ఈమె పుట్టిన రోజు. ఎపుడు తల్లి తండ్రులు సోదరుడుతో పుట్టినరోజు వేడుకలు చేసుకునే ఈ మెగా ప్రిన్సెస్ తొలిసారి భర్తతో కలిసి తన బర్త్ డే వేడుకలు జరుపుకుంటోంది.