నాన్నకు జన్మదిన శుభాకాంక్షలు – మహేష్ బాబు

సూపర్ స్టార్ కృష్ణ ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా ద్వారా అభిమానుల నుంచి, ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా మహేష్ బాబు తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా. నాకు ఎల్లప్పుడూ ఉత్తమ మార్గాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. మీరు ఊహించనంత ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను’ అంటూ తండ్రితో పాటు కలిసి ఉన్న పిక్ ను షేర్ చేసుకున్నారు. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేష్ హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’, త్రివిక్రమ్ చిత్రాల నుంచి స్పెషల్ ట్రీట్ ఉంటుందని ఆయన అభిమానులు భావించారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈ రోజు ఎటువంటి అప్డేట్ ఉండదని ‘సర్కారు వారి పాట’ బృందం స్పష్టం చేశారు.