గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన నవదీప్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొనసాగుతున్న క్రమంలో ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు అలీ రేజా విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి ఈరోజు తన స్వగృహంలో నవదీప్ మొక్కలు నాటాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం వల్ల ఈ దేశానికి మన రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరమని. మనందరం ఆరోగ్యకరంగా ఉండాలంటే మొక్కలు అవసరమని కాబట్టి అందరం కూడా మొక్కలు పెంచే బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.