హరీష్ శంకర్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

ప్రేక్షకుల నాడీ.. నవతరం అభిరుచులు తెలిసిన దర్శకుడు హరీష్ శంకర్. ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు భాష, రచనలపైనా, కళల గురించి చక్కటి అవగాహన ఉన్న దర్శకుడు శ్రీ హరీష్ శంకర్. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.