శ్రీ చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయనకు ఆ భగవంతుడు సంతోషకర జీవితంతోపాటు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నానని జనసేనాని పేర్కొన్నారు.