ఘనంగా విజయ్ కుమార్ సింగ పుట్టినరోజు వేడుకలు

హైదరాబాద్: సుప్రజ హాస్పిటల్ ఎండి డాక్టర్ విజయ్ కుమార్ సింగ పుట్టినరోజు సందర్భంగా గురువారం జనగామ జిల్లా, శామీర్ పేట గ్రామంలో ఇటీవల తాటి చెట్టు పైనుండి పడి మృతి చెందిన గీత కార్మికుడు రాజు కుటుంబానికి నిత్యవసర వస్తువులు అందించడం జరిగింది. అదేవిధంగా వర్ధన్ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వసీం అక్రమ్ మాట్లాడుతూ.. డాక్టర్ గారు ఎంతోమంది పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారని, కార్మికులందరికీ సహాయం అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ అధ్యక్షులు జోగు భాస్కర్, సంతోష్, జోగు ఉదయ్, రోహిత్, సాయి, రంజిత్, నరేంద్ర పవన్ తదితరులు పాల్గొన్నారు.