మాతృమూర్తులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ.. సృష్టిలో తల్లి ప్రేమ ఎంతో గొప్పది, ఎంతో స్వచ్ఛమైనదన్నారు. ఓర్పు, సహనం, ప్రేమ, త్యాగం వంటి ఎన్నోసుగుణాలను మనం తల్లినుంచే నేర్చుకుంటామన్నారు. ఒక మనిషి ఎదుగుదలకు మాతృమూర్తి పాత్ర ఎంతో కీలకమని సీఎం తెలిపారు. మహిళలు, మాతృమూర్తుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచినట్లు సీఎం పేర్కొన్నారు.