నేతన్నలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు

జాతీయ చేనేత దినోత్సవం సందరబంగా పెడన నియోజకవర్గం జనసేన నాయకులు ఎస్ వి బాబు నేతన్నలకు, చేనేత కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చేనేత కార్మికుల కష్టాలను అధ్యయనం చేయాలని పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితో జనసేన పార్టీ నుండి చేనేత వికాస విభాగాన్ని ఏర్పాటు చేసి.. ఒక చైర్మన్ ను కొందరు సభ్యులను నియమించి చేనేత కార్మికుల కష్టాలను, వారి స్థితిగతులను అధ్యయనం చేసి రాబోయే రోజుల్లో చేనేత కార్మికుల కష్టాలను తీర్చే విధంగా ఓ ప్రణాళిక సిద్ధం చేశారని తెలియజేసారు.