నూతన సంవత్సర శుభాకాంక్షలు

మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న భారతీయులందరికీ నా పక్షాన, జనసేన పక్షాన నూతన సంవత్సర ప్రేమపూర్వక శుభాకాంక్షలు అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. కోటి ఆశలతో కొంగొత్తగా మన జీవితాలలో ఆవిష్కృతమవుతున్న 2023 సంవత్సరం తెలుగువారందరికీ సుసంపన్నమైన భవిష్యత్తు, చక్కటి ఆరోగ్యం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని జనసేనాని అన్నారు.