ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: జగన్‌

72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే ఎంతో గొప్పదైన మన రాజ్యాంగం అమలు ప్రారంభమై 71 సంవత్సరాలు పూర్తి చేసుకుని రేపటికి 72వ ఏడాదిలోకి అడుగు పెడుతున్న ఈ శుభ సమయంలో రాజ్యాంగ పీఠికలో ప్రస్తావించిన ప్రతి ఒక్క మాటా ఎంత విలువైనదో, ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవాలన్నారు.