కరోనా పాజిటివ్ ఉన్నవారు పరీక్షలు రాయనవసరం లేదు..

ఏపీలో పరీక్షల నిర్వహణపై పునరాలోచించుకోవాలని ఓవైపు హైకోర్టు సూచిస్తుండగా… ప్రభుత్వం మాత్రం పరీక్షలు నిర్వహించాలన్న తమ నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తాజాగా మాట్లాడుతూ, ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. మే 5 నుంచి 23 వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ప్రతి విద్యార్థికి థర్మల్ స్క్రీనింగ్ చేశాకే ఎగ్జామ్ హాల్లోకి పంపుతామని అన్నారు.

పిల్లల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. అయితే కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులు పరీక్షలు రాయనవసరంలేదని పేర్కొన్నారు. వారికి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి రెగ్యులర్ సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పారు.