తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా హారిక.. క్లారిటీ వచ్చేసింది

తెలంగాణ టూరిజం బ్రాండ్‌ అంబాసిడర్‌గా బిగ్‌బాస్‌ ఫేం, నటి హారికను నియమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్‌ హారికను నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. అయితే దేత్తడి హారికను టీఎస్‌టీడీసీ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన విషయం టూరిజం మంత్రికి కూడా తెలియదని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా హారికే ఉంటారని స్పష్టం చేశారు. టీఎస్‌టీడీసీ బ్రాండ్ అంబాసిడర్‌ గా హారికను తొలగించారని వస్తున్న వార్తలను ఖండించారు. ఈ వార్తల్లో నిజం లేదన్నారు.