ఆరోగ్యశాఖపై సబ్ కమిటీ సమావేశం

ఆరోగ్యశాఖపై సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ వైద్యారోగ్య శాఖ 365 రోజులు నిరంతరం పని చేస్తుందని పేర్కొన్నారు. వైద్యశాఖను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కొవిడ్ నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైతే ఆరోగ్య శాఖ మాత్రం ప్రజా సేవలో నిమగ్నమైందని మంత్రి ఈటల తెలిపారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. కరోనా నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అద్భుతంగా పని చేస్తోందన్నారు. పంచాయతీరాజ్‌, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖలు కలిసి పనిచేయడం వల్లే… ఈ సారి సీజనల్ వ్యాధులు కూడా బాగా తగ్గాయన్నారు. రోగాలు, వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన పెరిగిందని కేటీఆర్‌ పేర్కొన్నారు.