వారాహి యాత్రకు మద్దతుగా హిందూపురం జనసేన పాదయాత్ర

హిందూపురం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్రకు మద్దతుగా ఆదివారం ఉదయం సూగురు ఆంజనేయ స్వామి దేవాలయంలో హిందూపురం నియోజకవర్గం ఇంచార్జ్ ఆకుల ఉమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం ఉదయం 10 గంటలకు పాదయాత్రను మొదలు పెట్టి చిన్న మార్కెట్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్, రహమాత్ పూర్ సర్కిల్ మీదుగా లేపాక్షి మండలం నుండి చిలమత్తూరు మండలం కనుమ నరసింహ స్వామి దేవాలయానికి చేరుకొని ప్రత్యేక పూజ అనంతరం 30 కిలోమీటర్ల మేర 150 మందితో పాదయాత్రను సద్విజయంగా ముగించారు. ఈ పాదయాత్ర ఘనవిజయానికి అడుగులో అడుగు వేసిన జనసేన హిందూపురం నియోజకవర్గ నాయకులకు, జనసైనికులకు ఆకుల ఉమేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎల్.ఐ.సి రమణ, చిలమత్తూరు, లేపాక్షి, హిందూపురం మండల, పట్టణ అధ్యక్షులు, చిన్నా ప్రవీణ్, లోకేష్, శేఖర్, చక్రి, కార్యనిర్వహన కమిటీ సభ్యులు అగ్గి శీన, నాగరాజు, నియోజకవర్గ నాయకులు, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.