వైయస్సార్ నగర్ సమస్యలపై జనసేన పోరాడుతుంది

నెల్లూరు: పేరుకే వైయస్సార్ నగర్.. వైయస్సార్ పార్టీ అధికారంలో ఉన్న 9 ఏళ్ళు నెల్లూరు రూరల్ ఈ ప్రాంతాన్ని పట్టించుకున్నది లేదు. జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆదివారం ఆ ప్రాంతాన్ని సందర్శించి వారి సమస్యలపై కమిషనర్ గారికి ఫిర్యాదు చేసి, వారి సమస్యలు తీరే వరకు కూడా జనసేన పార్టీ తరఫున తోడుగా ఉంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ప్రాంతపు వాసులు గత పదేళ్లుగా సమస్యల వలయంలో కొట్టుమిట్టాలాడుతున్నారు. కార్పొరేషన్ కూత వేటు దూరంలో ఉన్న 31 డివిజన్ వైయస్సార్ నగర్ లో మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా ఒకే ప్రభుత్వం వైఎస్ఆర్సిపి లో అధికారంలో ఉన్న వారిని పట్టించుకున్న పరిస్థితి లేదు. అధ్వానంగా ఉన్న చెత్త దుర్గంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ కాలవల్లేక ఎవరి ఇంటి ముందు వాళ్లే డ్రైనేజీ ఉండి ప్రజల వ్యాధులకు గురవుతున్నారు. ఆ ప్రాంతంలో ఇప్పటికి త్రాగునీరు అందట్లేదు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసుకోవచ్చు. గత టిడిపి ప్రభుత్వం వాటర్ లైన్ వేసినప్పటికీ మంచినీరు సప్లై లేదు, వాటర్ ట్యాంకులు కూడా ఐదు రోజులకు ఒకసారి అక్కడికి వచ్చే పరిస్థితి. వాన పడితే రోడ్లంతా గుంతలమై బురదమయం ఎక్కడా నడిచే పరిస్థితి లేదు. చుట్టూ చెత్తాచెదారం పేరుకుపోయి పాములు పందులు తో నానా అవస్థలు పడుతున్నారు ప్రజలు. వీరి సమస్యలు కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారానికి జనసేన పార్టీ తరఫున పోరాడుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, నగర కార్యదర్శి కృష్ణవేణి, శ్రీను, అమీన్, హేమచంద్ర యాదవ్, షాజహాన్ వర్షన్ తదితరులు పాల్గొన్నారు.