ముస్లిం సోదరులకు సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు: పులి మల్లికార్జున రావు

రంజాన్ పర్వదినం సందర్భంగా నియోజకవర్గంలోని ముస్లిం సోదర సోదరీమణులందరికీ మరియు ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారికి కందుకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ పులి మల్లికార్జున రావు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ.. 30 రోజులు రంజాన్ మాసం అంతా ఎంతో భక్తిశ్రద్ధలతో కఠినమైన ఉపవాస దీక్షలు పూర్తి చేసుకొని మంగళవారం రంజాన్ పండుగ జరుపుకుంటున్న ప్రతి ముస్లిం సోదరుల, సోదరీమణుల మీద అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని.. వారు సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి ముస్లిం సోదరులందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.