రాజుపాలెంలో ఇంటింటి జనసేన

సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం, అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వారు చేసిన అవినీతి పనులు అమలు చేయని హామీలు ఇచ్చి ప్రజలను ఎలా మోసం చేశారో వివరిస్తూ బొర్రా వెంకట అప్పారావు ఆధ్వర్యంలో మొదలుపెట్టిన ఇంటింటి జనసేన కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాజుపాలెం మండలంలోని దేవరంపాడు గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బొర్రా వెంకట అప్పారావు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ 2024లో పవన్ కళ్యాణ్ కి అందరూ ఓట్లు వేసి అవినీతి రహిత పాలన సాధించాలని ఒక్క అవకాశం పవన్ కళ్యాణ్ కల్పించాలని ప్రజలకు విన్నవించుకుంటూ ఈ కార్యక్రమం కొనసాగిస్తూ అందులోనే భాగంగా దేవరపాడు గ్రామంలో జనసైనికులు ఏర్పాటుచేసిన నూతన జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బొర్రా వెంకట అప్పారావుని ఆహ్వానించడం జరిగినది. అప్పారావు చేతుల మీదుగా జనసేన జెండా ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కౌన్సిలర్ 4 మండల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు గ్రామ కమిటీ సభ్యులు మండల కమిటీ సభ్యులు జనసైనికులు వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.