ప్రజలను మభ్యపెట్టడానికే గృహ సారధులు, వాలంటీర్ల వ్యవస్థలు.. రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు నియోజకవర్గ జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు ఏదైతే ఉన్నాయో, కమిటీల ద్వారా దోచేస్తున్నారని ఎవరికి స్కీములు అందాలన్నా, లంచాలు ముట్టాలన్న ఈ కమిటీలే సహకరించేదని, మా వైసీపీ ప్రభుత్వం వస్తే ఎవరూ ఏ విధమైనటువంటి పార్టీ నుంచి దళారులు ఉండరని, కారుకూతలు కూసిన జగన్మోహన్ రెడ్డి ఆనాటి ప్రతిపక్ష లీడర్ గా ఈనాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. ఈరోజున ఒక వాలంటరీ, ముగ్గురు గృహ సారధులు ప్రతి సచివాలయానికి కన్వీనర్లు అందరిని ఏ విధంగా మీరు ఉపయోగించుకుంటున్నారు. వాలంటీర్లను సొంత పార్టీ కార్యకర్తలుగా వాడుకుంటున్నారు. ప్రభుత్వం ప్రజాధనాన్ని వాళ్లకి జీతాలుగా ఇస్తున్నారు. ప్రతి 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ను, ముగ్గురు గృహసారదులని, ముగ్గురిని సచివాలయానికి కన్వీనర్లుగా నియమిస్తూ, వీళ్లందరినీ నియంత్రిస్తూ తమ పాకెట్లో పెట్టుకున్నారని ప్రజల యొక్క గోప్యతను వాలంటీర్ల ద్వారా వారి యొక్క గుట్లను లాగుతున్నారని వారి సమాచారాన్ని తీసుకుంటున్నారు. వారికి ఎక్కడెక్కడ ఇల్లు ఉన్నాయో?, వారి ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో?, ఎవరికి చేయూతనిస్తున్నారు?, ఎవరికి నవరత్నాలు ఇస్తున్నారు? వాళ్లు ఎవరినైనా ఇతర పార్టీల నాయకులకు సపోర్ట్ చేస్తే మేము అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కట్ చేస్తామని వాలంటీర్ల తో బెదిరిస్తూ ఈ విధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. నేడు అట్టహాసంగా మీరు ప్రవేశపెట్టిన రాష్ట్రవ్యాప్తంగా గృహ సారధుల మీటింగులు కానీ అదేవిధంగా కన్వీనర్లు ఎవరైతే ఉన్నారో ఈరోజు సచివాలయాన్ని సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చెప్పినదానికి నేడు మీరు చేస్తున్న దానికి విశ్వసనీయత లేదని, చెప్పిన మాటలన్నీ అబద్దాలని, ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీరు ఏ విధంగా అయితే నిలదీశారో ఈరోజున మీరు కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నారని, ప్రజలను మోసం చేస్తూ వాళ్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు‌. దీనిని ఏలూరు జనసేన పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇప్పటికైనా మీరు గృహసారదులుగా పార్టీ బూత్ కమిటీ ఇతర కమిటీ ఈరోజు ఏదైతే ప్రజాధనాన్ని వెచ్చించి ఓట్లు కొనుక్కొని ఓట్లను బ్లాక్ మెయిల్ చేసి దండుకునే పరిస్థితిని చూస్తున్నామన్నారు. దీనిని విరమించుకోవాలని మీకు ఏమాత్రం సిగ్గు శరం ఉంటే ప్రజల పట్ల అభిమానం ఉంటే విచక్షణ ఉంటే ఇలాంటి కార్యక్రమం మరల చేయడానికి పూనుకోరని, ఇలాంటి కార్యక్రమాన్ని విరమించుకోవాలని, ప్రశాంతమైన వాతావరణంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, అందరికీ నచ్చే విధంగా మీ పరిపాలన ఉండాలని జనసేన నుండి డిమాండ్ చేస్తున్నాం. ఈ పద్ధతులు మారకపోతే తొందరగానే మిమ్మల్ని ఇంటికి పంపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, బొత్స మధు అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, నాయకులు బొండా రాము నాయుడు, నిమ్మల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.