పేదలకు వంకల్లో ఇళ్ళు.. పునాదుల్లో నీళ్లు: దారం అనిత

మదనపల్లె గ్రామీణ మండలం, పోతబోలు పంచాయితీలో జగనన్న లే అవుట్ ను ఏర్పాటు చేసి మూడు వేల మందికిపైగా లబ్ధిదారులకు ఇంటి పట్టాలు కేటాయించారు. ఈ లే అవుట్ లో వర్షపు నీరు ప్రవహించే కాలవ బావుంది. ఇందులో కూడా అధికారులు దాదాపు పదిమందికి ఇంటి ప్లాట్ లు కేటాయించారు. కొందరు పునాదులు తీయగా.. ఇటీవల కురిసిన వర్షం కారణంగా ఇంటి పునాది లోకి నీరు వచ్చి చేరింది. మరికొందరు పునాదులు నిర్మించుకునేందుకు తవ్విన గుంతలోకి నీరు వచ్చి చేరింది. దీంతో ఇంటి నిర్మాణానికి ఇబ్బందిగా మారిందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఇంటి పట్టాలకు అర్హులైన పేదలకు ఇచ్చే ఇంటి పట్టాల విషయంలో ప్రభుత్వానికి నిర్లక్ష్య వైఖరి తగదు. వారు నివసించడానికి కట్టుకున్న ఇల్లు పదికాలాలపాటు బాగుండాలంటే.. వాగుల్లో, వంకల్లో కాకుండా సరైన స్థలంలో పట్టాలను ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కావున అధికారులు స్పందించి వర్షపు నీరు నిర్వహించే వంకల్లో.. ప్లాట్లు తీసి మరో ప్రాంతంలో పట్టాలు ఇవ్వాలని జనసేన పార్టీ తరఫున చిత్తూరు జిల్లా జనసేన ప్రధాన కార్యాదర్శి దారం అనిత డిమాండ్ చేశారు.