ఇంకెంతమంది ప్రాణాలు బలిగొంటారు: కిల్లో రాజన్

పాడేరు, వైసీపీ ప్రభుత్వానికి ఎలాగో ఆదివాసీల ప్రాణాలంటే లెక్కలేదు, కానీ కనీసం ఓటు వేసి గెలిపించిన సాటి జాతి మీద అయినా ఈ నాయకులకు కనీస విశ్వాసంలేదా..? ఎందుకింత అక్కసు..? హక్కులు ఎలాగో కొళ్లగొట్టేసారు, మా జీవనాడినీ విరిచి మా ప్రాణాలతో కూడా చెలగాటమాడుతున్నారు. మీ పార్టీ మెహర్బానికోసం కోట్లాది రూపాయలు మా ధనం వృధా చేసే బదులు, మా ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేయండి. చదువుతున్న పిల్లలకు రక్షణ లేదు, ఇన్ని మరణాలు జరుగుతున్న మీకు కనీసం చీమ కుట్టినంత స్పర్శ లేదు, ఇంతటి దౌర్భాగ్యం ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు. తక్షణమే చర్యలు తీసుకోవాలనికోరుతున్నాం. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకి చట్ట ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలి, నిర్లక్ష్యం వహిస్తున్న, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి, ఇన్ని మరణాలు జరుగుతున్నా గిరిజన సంక్షేమ శాఖ చొరవ చూపకపోవడం విడ్డూరం, గిరిజన విద్యాశాఖకి సంబందించిన ప్రతి అధికారుల మీద, క్రిమినల్ కేసులు నమోదు చేసి ఉద్యోగాల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. మా పిల్లల ప్రాణాల మీద బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న ఈ అధికారులు మాకు అవసరంలేదని తెలిపారు. కేజీహెచ్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విద్యార్థి కొర్ర ప్రవీణ్ తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, మీకు న్యాయం జరిగేవరకు జనసేన పార్టీ తరపున పోరాటం చేస్తామని భరోసా కల్పించి మనోస్థైర్యం కల్పించారు.